
ఆంజనేయునికి ఆధార్ కార్డ్!
అవును.. మీరు చూస్తున్నది నిజమైన ఫొటోనే. సాక్షాత్తూ భగవంతుడైన హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశారు! ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541.
అవును.. మీరు చూస్తున్నది నిజమైన ఫొటోనే. సాక్షాత్తూ భగవంతుడైన హనుమంతుడికి కూడా ఆధార్ కార్డు ఇచ్చేశారు! ఆయన ఆధార్ సంఖ్య 2094 7051 9541. కార్డుపై హనుమంతుడి ఫొటోతో సహా ఇతర వివరాలు కూడా పొందుపర్చారు. ఆయన తండ్రి పేరు పవన్(అంటే వాయుదేవుడు). మొబైల్ ఫోన్ నంబర్‌తో పాటు వేలిముద్ర కూడా ఉంది.
బెంగళూరు నుంచి సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని దంత రాంగఢ్ ప్రాంతానికి ఈ కార్డు వచ్చింది. అయితే అడ్రసు సరిగ్గా లేకపోవడంతో ఎవరికి అందజేయాలో తెలియక పోస్టుమ్యాన్ హీరాలాల్ తికమకపడ్డాడు. తీరా అది హనుమంతుడి పేరుతో సృష్టించిన ఆధార్ అని తెలుసుకుని కంగుతిన్నాడు. ఆధార్‌పై ఉన్న సెల్‌కు ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో చేసేదేమీ లేక పోస్టుమాస్టర్ దీనిని బెంగళూరుకు తిప్పిపంపాడు. అన్నట్టూ.. హనుమాన్ జీ వయసెంతో తెలుసా? జస్ట్.. 53 ఏళ్లేనట! ఆయన 1-1-1959న పుట్టినట్టు కార్డుపై ముద్రించారు.