కశ్మీర్‌లో మహిళా కమెండోల బృందం | Lady Commandos Ready To Deal With Women Stone Pelters In Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో మహిళా కమెండోల బృందం

Jun 29 2018 7:08 PM | Updated on Jun 29 2018 7:08 PM

Lady Commandos Ready To Deal With Women Stone Pelters In Kashmir - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న రాళ్ల దాడులు భద్రతా దళాలకు సవాల్‌గా మారింది. రాళ్లు విసిరే అల్లరి మూకల్లో మహిళలు సైతం పెద్దసంఖ్యలో ఉండటంతో వారిని ఎదుర్కొనేందుకు ఇలాంటి సందర్భాల్లో మహిళా కమాండోలను రంగంలోకి దించేందుకు సీఆర్‌పీఎఫ్‌ సంసిద్ధమైంది. కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డం‍కిగా మారిన రాళ్లదాడుల ఉదంతాల్లో ఇటీవల మహిళల సంఖ్య పెరగడంతో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో పెద్దసంఖ్యలో మహిళా కమాండోలను నియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రాళ్లదాడులకు పాల్పడే మహిళలను అదుపు చేసేందుకు ప్రత్యేకించి సూపర్‌ 500 పేరిట మహిళా కమాండోల బృందం త్వరంలో రంగంలోకి దిగనుందని అధికారులు తెలిపారు. రాళ్లదాడుల్లో మహిళలు భద్రతా దళాలను టార్గెట్‌ చేసే సందర్భంలో ఈ కమాండోలు తెరపైకి వస్తాయని చెబుతున్నారు. వీరికి ఆయుధాలను వాడటంతో పాటు ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలనే అంశాలపై కఠోర శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement