4జీలో కోల్‌కతా టాప్‌..

Kolkata Tops List Of Indian Cities With Best 4G Availability - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 4జీ విస్తరణ వేగంగా చోటుచేసుకుంటున్న క్రమంలో 4జీ అందుబాటు స్కోరులో 90 శాతం పైగా సాధించి కోల్‌కతా అగ్రశ్రేణి నగరంగా నిలిచింది. దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలో కోల్‌కతా మొదటి స్ధానంలో ఉందని లండన్‌కు చెందిన వైర్‌లెస్‌ కవరేజ్‌ మ్యాపింగ్‌ కంపెనీ ఓపెన్‌సిగ్నల్‌ వెల్లడించింది. ఇక పంజాబ్‌ (89.8 శాతం) బిహార్‌ (89.2), మధ్యప్రదేశ్‌ (89.1), ఒడిషా (89 శాతం)సర్కిల్‌లు తరువాతి స్ధానాల్లో ఉన్నాయని పేర్కొంది.

2012 నుంచి భారత్‌లో 4జీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేవలం ఆరేళ్లలో దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ శీఘ్రగతిన వృద్ధి చెందిందని తెలిపింది. 4జీ అందుబాటులో ఉన్న నగరాల్లో తూర్పు, ఉత్తరాది సర్కిళ్లు అగ్రభాగాన ఉన్నాయని ఓపెన్‌సిగ్నల్‌ వెల్లడించింది. ఇక భారత్‌లోని 20 అతిపెద్ద నగరాల్లో 4జీ అందుబాటులో ముంబై 15వ ర్యాంక్‌లో నిలవగా, ఢిల్లీ 17వ ర్యాంక్‌లో ఉందని తెలిపింది.

భారత్‌ మరోవిడత స్పెక్ర్టమ్‌ వేలంకు సిద్ధమవుతున్న తరుణంలో 4జీ అందుబాటు స్కోర్లు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. జియో రాకతో భారత్‌లో 4జీ ఊపందుకుందని, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 కోట్ల మందికి జియో 4జీ సబ్‌స్ర్కిప్షన్లు అందించిందని మార్కెట్‌ పరిశోధన సంస్ధ సైబర్‌మీడియా రీసెర్చ్‌ అంచనా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top