‘కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధం’

Kejriwal Says Situation in Delhi Under Control After COVID-19 Lockdown - Sakshi

వైరస్‌ కేసుల్లో అసాధారణ పెరుగుదల లేదు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో వణుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ 4.0లో పలు సడలింపులు ఇచ్చినా వైరస్‌ కేసుల్లో ఎలాంటి అసాధారణ పెరుగుదల చోటుచేసుకోలేదని అన్నారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి 3500 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 రోగుల కోసం 4,500 పడకలు సిద్ధంగా ఉండగా, వీటిలో కేవలం 2000 పడకలే వినియోగంలో ఉన్నాయని చెప్పారు. ఇంకా 2000 పడకలు కరోనా రోగులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇక 3314 మంది వైరస్‌ రోగులు వారి ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారని అన్నారు. ఢిల్లీలో ఇప్పటివరకూ 13.418 కేసులు నమోదవగా దాదాపు 6540 మంది కోలుకున్నారని చెప్పారు. తాజా కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు.

చదవండి : ‘అలా జీవిస్తే.. భగవంతుడు రక్షిస్తాడు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top