‘అలా జీవిస్తే.. భగవంతుడు రక్షిస్తాడు’

Arvind Kejriwal Says If We Show Discipline God Will Help Us - Sakshi

న్యూఢిల్లీ : కరోనాను ఎదుర్కొవడానికి ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటుగా, మాస్క్‌లు ధరించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ 4.0 భాగంగా పలు సడలింపులు అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. నేటి నుంచి ఢిల్లీలో కొన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. క్రమశిక్షణ పాటించడం, కరోనా వైరస్‌ను నియంత్రించడం మనందరి మీద ఉన్న గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. మనం క్రమశిక్షతో జీవిస్తేనే భగవంతుడు మనల్ని రక్షిస్తాడని అన్నారు.(చదవండి : కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత)

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం.. ప్రజా రవాణాకు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే మెట్రో సర్వీసులకు మాత్రం అనుమతి నిరాకరించింది. ఇటీవల లాక్‌డౌన్‌పై మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌.. ‘కరోనా వైరస్ అదృశ్యమయ్యే పరిస్థితి లేదు. మనం కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది. పూర్తికాలం లాక్‌డౌన్‌ను విధించడం కుదరదు. కరోనాను ఎదుర్కొవడానికి  తగిన విధంగా సన్నద్ధం కావడానికి(వైద్య సదుపాయాలు) ఏర్పరుచుకోవడానికి లాక్‌డౌన్‌ను విధించాం. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన సమయం వచ్చింది’ అని తెలిపారు.(చదవండి : ఆ వాహనాలను అనుమతించం.. )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top