కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత | Coronavirus : Ram Vilas Paswan Office In Krishi Bhawan Sealed | Sakshi
Sakshi News home page

కరోనా.. కేంద్ర మంత్రి కార్యాలయం మూసివేత

May 19 2020 11:55 AM | Updated on May 19 2020 11:56 AM

Coronavirus : Ram Vilas Paswan Office In Krishi Bhawan Sealed - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. తాజాగా కరోనా సెగ.. కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కార్యాలయాన్ని తాకింది. సెంట్రల్‌ ఢిల్లీలోని కృషి భవన్‌లో ఆయన ఆధ్వర్యంలోని ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మత్స్య, పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. (చదవండి : భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు)

పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం కోసం మే 19, 20 తేదీల్లో కార్యాలయాన్ని మూసివేయనున్నట్టుగా తెలిపారు. కాగా, ప్రస్తుతం రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖలు ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 28న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నీతి ఆయోగ్‌ కార్యాలయాన్ని మూసివేసి.. శానిటైజన్‌ ప్రక్రియ చేపట్టారు. మే 5న న్యాయశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకడంతో శాస్త్రి భవన్‌ బిల్డింగ్‌లోని ఒక ఫ్లోర్‌ను మూసివేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement