పాఠ్యాంశాల నుంచి టిప్పు సుల్తాన్‌ పేరు తొలగింపు..

Karnataka CM Says Considering A Proposal To Remove Tipu Sultans Name From Textbooks - Sakshi

బెంగళూర్‌ : పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్‌ పేరును తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప వెల్లడించారు. టిప్పు సుల్తాన్‌ జయంతి జరపబోమని, ఆయన పేరిట ఉన్న పాఠ్యాంశాలను తొలగిస్తామని తేల్చిచెప్పారు. టిప్పు సుల్తాన్‌ స్వాతంత్ర సమరయోధుడన్న కొందరి వాదనతో తాను విభేదిస్తానని స్పష్టం చేశారు. నవంబర్‌ 10న టిప్పు సుల్తాన్‌ జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరపరాదని తాము ఇప్పటికే నిర్ణయించామని తెలిపారు. టిప్పు సుల్తాన్‌ బలవంతపు మతమార్పిళ్లు, దేవాలయాల కూల్చివేత, హిందువులను వేధించడం వంటి చర్యలకు పాల్పడి వివాదాస్పద పాలకుడైనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top