ఢిల్లీ మార్చ్‌లో కన్నయ్య.. ఏబీవీపీ ఆగ్రహం | Kanhaiya joins DU march, preaches non-violence; go back, says ABVP | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మార్చ్‌లో కన్నయ్య.. ఏబీవీపీ ఆగ్రహం

Feb 28 2017 7:43 PM | Updated on Sep 5 2017 4:51 AM

ఢిల్లీ మార్చ్‌లో కన్నయ్య.. ఏబీవీపీ ఆగ్రహం

ఢిల్లీ మార్చ్‌లో కన్నయ్య.. ఏబీవీపీ ఆగ్రహం

దేశద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్యకుమార్‌ తిరిగి ఢిల్లీ యూనివర్సిటీలో కనిపించాడు. ఢిల్లీ యూనివర్సిటీలో అఖిలభారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు.

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్యకుమార్‌ తిరిగి ఢిల్లీ యూనివర్సిటీలో కనిపించాడు. ఢిల్లీ యూనివర్సిటీలో అఖిలభారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. అహింస పరిస్థితులు యూనివర్సిటీల్లో నెలకొల్పాలని శాంతియుత పరిస్థితులు ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు.

మరోపక్క, ఏబీవీపీ విద్యార్థులు కన్నయ్య కుమార్‌ గోబ్యాక్‌ అంటూ ప్రతి నినాదాలతో హోరెత్తించారు. ఏబీవీపీ, ఏఐఎస్‌ఏ విద్యార్థుల మధ్య ఈ నెల 22న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్‌ కాలేజీలో వివాదం రగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఏబీవీపీకి వ్యతిరేకంగా వివిధ కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, టీచర్లు ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఏబీవీపీ తన ఆగడాల ఆపేయాలంటూ మండిపడ్డారు. ఈ ర్యాలీలోనే కన్నయ్య పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement