కేరళ గవర్నర్గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు.
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా సదాశివం నియామకంపై కాంగ్రెస్ పార్టీ సహా న్యాయవాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా కేంద్ర ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది. ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చిన వెంటనే కేరళ గవర్నర్గా సదాశివం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.