కన్నయ కుమార్‌కు ఊరట

JNU Order Against Kanhaiya Kumar As Illegal And Irrational - Sakshi

జేఎన్‌యూ విధించిన జరిమానాను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్నయ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జేఎన్‌యూ  అతనిపై విధించిన జరిమానా అక్రమం, అహేతకమైనదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు అతనిపై  విధించిన జరిమానాను కొట్టివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది.. దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో కన్నయ కుమార్‌పై పది వేలు ఫైన్‌తో పాటు, క్రమశిక్షణ ఉల్లంఘనపై జేఎన్‌యూ 2016లో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

యూనివర్సిటీ విచారణ కమిటీ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ కన్నయ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్ధ ముద్రుల్.. విచారణ సంఘం సమర్పించిన నివేదికను తప్పపడుతూ తీర్పును వెలువరించారు. అతనితో పాటు జేఎన్‌యూ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్‌, బట్టాచార్యలపై జేఎన్‌యూ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top