మరో ఆఫర్.. 908కే విమాన టికెట్! | Jet Airways offers 908 a ticket in air asia routes | Sakshi
Sakshi News home page

మరో ఆఫర్.. 908కే విమాన టికెట్!

Sep 23 2014 11:34 AM | Updated on Sep 2 2017 1:51 PM

మరో ఆఫర్.. 908కే విమాన టికెట్!

మరో ఆఫర్.. 908కే విమాన టికెట్!

దేశంలో విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వెల్లువెత్తిస్తున్నాయి.

దేశంలో విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వెల్లువెత్తిస్తున్నాయి. ఎయిర్ ఏషియా ఇండియా 690 రూపాయలకు విమానయానం అంటూ ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. దాన్నుంచి దాదాపు ప్రతి విమానయాన సంస్థ ఇలాంటి ఆఫర్లతోనే ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. దేశంలోని పలు మార్గాల్లో ఎకానమీ క్లాస్ టికెట్లను మొత్తం అన్ని పన్నులు కలుపుకొని 908 రూపాయలకే అందిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది.

ఈ ఆఫర్లో భాగంగా కొచ్చి-బెంగళూరు మార్గంలో టికెట్ 908 రూపాయలు, బెంగళూరు-కొచ్చి అయితే రూ. 1162 అవుతుంది. బెంగళూరు-చెన్నై టికెట్ రూ. 1162 కాగా, చెన్నై-బెంగళూరు రూ. 1017. గోవా-బెంగళూరు టికెట్ రూ. 916 అయితే బెంగళూరు-గోవా మాత్రం రూ. 1162 ఉంది. బెంగళూరు నుంచి చండీగఢ్, జైపూర్లకు మాత్రం రూ. 2390గా టికెట్ ధర నిర్ణయించారు.

ప్రధానంగా ఎయిర్ ఏషియా ఇండియా విమానాల ఆఫర్లున్న మార్గాల్లో మాత్రమే జెట్ ఎయిర్వేస్ కూడా తన ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. ఎయిర్ ఏషియా ఆఫర్లు కూడా అక్టోబర్ 5 వరకు ఉంటాయి. ఇందులో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుంచి జూన్ 30 వరకు ప్రయాణాలు చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement