ఆగస్ట్‌ 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష | JEE Advance exam to be held on August 23 | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌ 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

May 7 2020 6:51 PM | Updated on May 7 2020 7:07 PM

JEE Advance exam to be held on August 23 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల తేదీ ఖరారు అయింది. ఆగస్ట్‌ 23న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జెఈఈ  (మెయిన్) పరీక్ష జూలై 18 నుంచి 23 వరకు జరుగుతుందని, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జూలై 26 న జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

కాగా ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అయితే  కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement