పాక్‌ ఉగ్ర కుట్ర : పంజాబ్‌, రాజస్ధాన్‌లో హై అలర్ట్‌

Intel Agencies Sound High Alert For Punjab - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్ర దాడులపై నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్‌, రాజస్ధాన్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్‌, రాజస్ధాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ తన ముజహిదీన్‌ బెటాలియన్‌ సైన్యం సహకారంతో చొరబాట్లను ప్రోత్సహించవచ్చన్న సమాచారంతో ఈ రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. పాక్‌ నుంచి ఎలాంటి కవ్వింపు చర్య ఎదురైనా తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పటికే సైన్యం అదనపు సేనలను మోహరించింది.

భారత్‌లో ఉగ్ర దాడులను చేపట్టేందుకు రాజస్ధాన్‌, పంజాబ్‌ సరిహద్దు ద్వారా చొరబాట్లను ప్రేరేపించేందుకు పాక్‌ సాఫ్ట్‌ టార్గెట్‌గా ఎంచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్‌ సరిహద్దుకు చేరువగా ఉన్న రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘా పెంచాలని బీఎస్‌ఎఫ్‌తో పాటు వాయుసేనను నిఘా సంస్ధలు కోరాయి. మరోవైపు ఆర్టికల్‌ 370 రద్దుతో పుల్వామా తరహా దాడులు మరికొన్ని చోటుచేసుకుంటాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ‍్యలపై శివసేన మండిపడింది. ఇమ్రాన్‌ వ్యాఖ్యలే పుల్వామా దాడి వెనుక పాక్‌ హస్తం ఉందనేందుకు ఆధారాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top