రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే! | Insurance Premium compulsory to railway passengers | Sakshi
Sakshi News home page

రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!

Nov 23 2016 5:57 PM | Updated on Sep 4 2017 8:55 PM

రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!

రైలెక్కాలంటే బీమా ప్రీమియం కట్టాల్సిందే!

రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సి ఉంటుంది.

అమరావతి : రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ఇకపై తప్పనిసరిగా బీమా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి టికెట్ తీసుకుంటే 92 పైసల్ని బీమా రూపంలో కట్టించుకుని జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఐఆర్‌సీటీసీ కల్పిస్తున్న ఆన్‌లైన్ రిజర్వేషన్ విధానంలో జారీ చేసే టికెట్లకు మాత్రం బీమా చెల్లింపునకు ఆప్షన్ విధానం కల్పించారు. ఈ ఆప్షన్ విధానాన్ని తొలగించి తప్పనిసరి చేస్తూ ఆన్‌లైన్ రిజర్వేషన్ విధానానికి సవరణలు చేయనున్నారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్రయాణికుల్లో 823 మందికి గాను 695 మంది ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకున్నారు. 128 మంది రైలు ప్రయాణ బీమా పొందారు. ఈ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదంలో 150 మంది మృతి చెందారు. రైలు ప్రయాణ బీమా పొందిన వారికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే రూ.10 లక్షలు, ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు, గాయాలైతే రూ.10 వేలు, రైలు ప్రయాణంలో సామాగ్రి పోతే రూ.5 వేలు పరిహారంగా అందుతాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement