బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం | Indigo Plane Collides With Aerobridge At Jaipur Airport | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం

May 6 2017 5:47 PM | Updated on Sep 5 2017 10:34 AM

బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం

బ్రిడ్జిని ఢీకొట్టిన విమానం

ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్‌లోని సంగనర్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అయిన తర్వాత పార్క్‌ చేసే క్రమంలో ఎయిరో బ్రిడ్జిని ఢీకొట్టింది.

జైపూర్‌: ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. జైపూర్‌లోని సంగనర్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అయిన తర్వాత పార్క్‌ చేసే క్రమంలో ఎయిరో బ్రిడ్జిని ఢీకొట్టింది. విమానం రెక్క ఒకటి బ్రిడ్జికి తగలడంతో స్వల్పంగా అది దెబ్బతిన్నది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.

ఢిల్లీ నుంచి శనివారం ఉదయం 174మంది ప్రయాణీకులతో బయలుదేరి వచ్చిన 6ఈ-962 ఇండిగో విమానం తొలుత విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. ఆ తర్వాత దానిని పార్కింక్‌ చేసేందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందని, దర్యాప్తునకు ఆదేశించామని ఎయిర్‌ పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం పీ బన్సల్‌ తెలిపారు. తమ అంతర్గత భద్రతా వ్యవహారాలు చూసే బృందంతో విచారణ చేయిస్తామని ఇండిగో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement