భారత్‌లో తొలి అండర్‌వాటర్‌ మెట్రో సిద్ధం.. | Indias First Underwater Metro Nears Completion | Sakshi
Sakshi News home page

భారత్‌లో తొలి అండర్‌వాటర్‌ మెట్రో సిద్ధం..

Jan 28 2020 10:48 AM | Updated on Jan 28 2020 1:11 PM

Indias First Underwater Metro Nears Completion - Sakshi

దేశంలోనే తొలి అం‍డర్‌ వాటర్‌ మెట్రో త్వరలో అందుబాటులోకి రానుంది.

కోల్‌కతా : హుగ్లీ నదిని దాటుతూ పరుగులు పెట్టే తొలి అండర్‌వాటర్‌ మెట్రో ఈస్ట్‌-వెస్ట్‌ ప్రాజెక్టును కోల్‌కతా మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ త్వరలో పట్టాలెక్కించనుంది. 1984లో చేపట్టిన ప్రాజెక్టుకు విస్తరణగా ముందుకొచ్చిన భారత్‌లో తొలి అండర్‌ వాటర్‌ మెట్రో ఎన్నో అవాంతరాలు, వ్యయ అంచనాలను అధిగమిస్తూ మార్చి 2022 నాటికి అందుబాటులోకి రానుంది. భారత రైల్వే బోర్డు నుంచి చివరి వాయిదాగా రూ 20 కోట్లు మైట్రో రైల్‌ అథారిటీకి అందనుండగా విస్తరణలో భాగంగా చేపట్టిన అండర్‌వాటర్‌ మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాయి.

దాదాపు రూ 10,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 49 శాతం మేరకు జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ నిధులు సమకూర్చింది. న్యూలైన్‌లో రోజుకు 9 లక్షల మంది అంటే నగర జనాభాలో 20 శాతం మంది ప్రయాణిస్తారు. 520 మీటర్ల అండర్‌వాటర్‌ టన్నెల్‌ను ఈ రైలు కేవలం నిమిషం లోపే దాటుతుందని అధికారులు వెల్లడించారు.

చదవండి : 8 కారిడార్లు.. 140.13 కి.మీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement