అసలు ధర రూ.29 చెల్లిస్తున్నది రూ.77 | Indians pay a whopping 153 % tax on petrol over its basic cost | Sakshi
Sakshi News home page

అసలు ధర రూ.29 చెల్లిస్తున్నది రూ.77

Apr 26 2017 12:53 AM | Updated on Jul 29 2019 6:10 PM

అసలు ధర రూ.29  చెల్లిస్తున్నది రూ.77 - Sakshi

అసలు ధర రూ.29 చెల్లిస్తున్నది రూ.77

ఇంధన శుద్ధి కేంద్రాలు లీటర్‌ పెట్రోలును రూ. 29.54 చొప్పున(మార్కెటింగ్‌ చార్జీలు కలుపుకుని) మార్కెటింగ్‌ కంపెనీలకు విడుదల

ఇంధన శుద్ధి కేంద్రాలు లీటర్‌ పెట్రోలును రూ. 29.54 చొప్పున(మార్కెటింగ్‌ చార్జీలు కలుపుకుని) మార్కెటింగ్‌ కంపెనీలకు విడుదల చేస్తుంటే ముంబై ప్రజలు మాత్రం రూ.77.50 చెల్లిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో అధికంగా వెచ్చిస్తున్న రూ.47.96కు కారణం రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులే. వీటిలో కేంద్ర ఎౖక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర వ్యాట్, ఆక్ట్రాయ్, సెస్, పెట్రోల్‌ పంపు యాజమాన్యాలకు ఇస్తున్న కమీషన్‌ తదితరాలున్నాయి.

మంగళవారం నాటి ముడి చమురు, డాలర్‌ – రూపాయి మారకపు విలువను దృష్టిలో పెట్టుకుని లెక్కకడితే... పన్ను రూపేణా ముంబై వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తం వాస్తవిక ధర కంటే 153 శాతం ఎక్కువ. ఈ విషయంపై ప్రభుత్వ సీనియర్‌ ఆర్థికవేత్త ఒకరు స్పందిస్తూ... ఆదాయం పెంచుకోవడానికే ప్రభుత్వం పెట్రోల్‌పై సెస్‌లను విధిస్తోందన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర రుణాలు రూ.4.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని, సంక్షేమ పథకాల కోసం మరిన్ని రుణాలను తీసుకునే స్థితిలో లేదని వివరించారు. తమ పరిధిలోని వస్తువులపై అదనపు డ్యూటీలు, సెస్‌లు విధించటమే ఏకైక మార్గమని చెప్పారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

డ్యూటీలు, వ్యాట్, సెస్‌ల రూపేణా 153% అధికంగా వెచ్చిస్తున్న ప్రజలు
పొరుగు దేశాల్లో ధరలు రూ. (లీటర్‌కు)
పాకిస్తాన్‌       43.68
శ్రీలంక          50.95
నేపాల్‌         64.94
బంగ్లాదేశ్‌      70.82

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement