కరోనా ఎఫెక్ట్‌ : 168 రైళ్లు రద్దు

Indian Railways Has Cancelled Many Trains Due To Low Occupancy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనతో ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండటంతో రవాణా రంగంపై పెను ప్రభావం చూపుతోంది. పలు రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో భారతీయ రైల్వేలు ఈనెల 20 నుంచి 31 వరకూ 168 రైళ్లను రద్దు చేశాయి. ఇక రద్దయిన రైళ్లలో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ సమాచారం వ్యక్తిగతంగా చేరవేశామని అధికారులు పేర్కొన్నారు. ఇక వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో జనసమ్మర్ధాన్ని తగ్గించేందుకు పలు రైల్వే జోన‍్ల పరిధిలో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలను పెంచారు. మరోవైపు మహమ్మారి వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని, సమూహాల్లో కలవకుండా ఉండాలని అత్యవసరమైతే మినహా ప్రయాణాలు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : ‘ఈ సంక్షోభం చాలా పెద్దది’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top