'గోవులతో తొక్కించుకుంటే భవిష్యత్‌ బావుంటుంది'

Indian men volunteer to be run over by cows in Hindu ritual, For Good Luck

ఉజ్జయిని : ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు నేలపై పడుకున్నారు. వందల సంఖ్యలో గోవులు వారి మీదుగా వెళ్లాయి. అంతే వారిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. అయినా వారు సంతోషంగా నవ్వారు. అందుకు కారణం ఉంది. అలా గోవులతో తొక్కించుకుంటే తమ భవిష్యత్‌, ఊరి భవిష్యత్‌ బావుంటుందని నమ్మకం.

ఉజ్జయిని పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 100 ఏళ్లుగా ఈ ఆచారం అమలువుతోంది. ఏటా దీపావళి పర్వదినం తర్వాత వచ్చే ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉజ్జయినికి తరలివెళ్తారు. కార్యక్రమంలో పాల్గొనే గోవులకు రంగులు, దండలు వేసి అలంకరిస్తారు. ఈ తంతును తిలకించేందుకూ పెద్ద ఎత్తున ప్రజలు ఉజ్జయినికి వెళ్తుంటారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top