బాంబు దాడులు భారత్‌లోనే అధికం | India is top in bomb attacks | Sakshi
Sakshi News home page

బాంబు దాడులు భారత్‌లోనే అధికం

Feb 15 2017 1:59 AM | Updated on Sep 5 2017 3:43 AM

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్‌ బాంబ్‌ డేటా సెంటర్‌ (ఎన్బీడీసీ) తాజా నివేదికలో వెల్లడించింది.

న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన బాంబు దాడుల్లో ఎక్కువ పేలుళ్లు భారత్‌లోనే జరిగినట్లు నేషనల్‌ బాంబ్‌ డేటా సెంటర్‌ (ఎన్బీడీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. యుద్ధం కాలంలో ఇరాక్, అఫ్గాన్  దేశాలపై జరిగిన బాంబు దాడుల కంటే భారత్‌లోనే అధికంగా దాడులు జరిగినట్లు పేర్కొంది.

ఈ ప్రకారం గత ఏడాది 406 బాంబుదాడులతో భారత్‌ మొదటి స్థానంలో నిలవగా, 221 బాంబుదాడుల తో ఇరాక్‌ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారన్న అంశాలేవీ నివేదికలో వెల్లడించలేదు. ఇక పొరుగు దేశం పాకిస్తాన్ లో 161, అఫ్గానిస్తాన్ లో 132 బాంబు దాడులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement