1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు | Sakshi
Sakshi News home page

1.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు

Published Fri, Dec 30 2016 2:31 AM

In 8 months, free LPG connections to 1.5 crore poor homes

న్యూఢిల్లీ: ఏడాదిలో 1.5 కోట్ల ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందివ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం కేవలం ఎనిమిది నెలల్లోనే చేరుకుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మూడేళ్లలో 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొలి ఏడాది 1.5 కోట్ల కనెక్షన్లు జారీచేయాలని నిర్దేశించుకుంది.

మూడేళ్లకు రూ.8 వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని 2016–17 బడ్జెట్‌లో ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసీసీ) సమాచారం ఆధారంగా గుర్తించిన నిరుపేద కుటుంబ మహిళ పేరిట ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్‌ జారీచేస్తారు.

Advertisement
Advertisement