అగ్నిగుండంగా మారుతున్న తమిళనాడు: స్వామి | impose president rule in tamil nadu, swamy asks centre | Sakshi
Sakshi News home page

అగ్నిగుండంగా మారుతున్న తమిళనాడు: స్వామి

Sep 29 2014 12:37 PM | Updated on Sep 2 2017 2:07 PM

తమిళనాడు అగ్నిగుండంగా మారుతోందని, అందువల్ల అక్కడ రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి కోరారు.

తమిళనాడు అగ్నిగుండంగా మారుతోందని, అందువల్ల అక్కడ రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి కోరారు. అక్రమాస్తుల కేసులో జయలలితను జైల్లో పెట్టడంతో అన్నాడీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహానికి గురై బస్సులను తగలబెట్టడం లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనిలా అన్నారు.

మరోవైపు తమిళనాడుకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. తిరుపతి నుంచి చెన్నైకి బస్సులు నడపలేమంటూ ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. దాంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదనుగా భావించి ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement