పోలీసుల నుంచి తప్పించుకున్న ఐఎం ఉగ్రవాది! | IM terrorist Afzal Usmani escapes from Mumbai Police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల నుంచి తప్పించుకున్న ఐఎం ఉగ్రవాది!

Sep 21 2013 1:51 AM | Updated on Sep 1 2017 10:53 PM

ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదిగా భావిస్తున్న అఫ్జల్ ఉస్మానీ ముంబై పోలీసుల నుంచి శుక్రవారం తప్పించుకున్నాడు.

ముంబై: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదిగా భావిస్తున్న అఫ్జల్ ఉస్మానీ ముంబై పోలీసుల నుంచి శుక్రవారం తప్పించుకున్నాడు. గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్‌లలో 2008లో సంభవించిన పేలుళ్ల కేసులో ఉస్మానీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌లోని తలోజా జైలు నుంచి దక్షిణ ముంబైలోని సెషన్స్ కోర్టుకు తీసుకువస్తుండగా పోలీసు చెరనుంచి ఉస్మానీ తప్పించుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అతని కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement