ఐఐటీ రూర్కీ విద్యార్ధులకు ఈ ఏడాది అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని క్యాంపస్ వర్గాలు తెలిపాయి.
ఐఐటీ రూర్కీకి 22 కంపెనీలు..
Aug 31 2017 10:33 PM | Updated on Sep 12 2017 1:29 AM
డెహ్రాడూన్: ఐఐటీ రూర్కీ విద్యార్ధులకు ఈ ఏడాది అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని క్యాంపస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించేబోయే ప్లేస్‌మెంట్స్‌లో 23 కంపెనీలు పాల్గొననున్నట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది. ఇప్పటికే క్యాంపస్ నియామకాల్లో 92 మందికి అవకాశం రాగా ఇందులో 82 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు.
వీరిలో ఓ విద్యార్థి గరిష్ఠంగా రూ.29.16 లక్షల ప్యాకేజి పొందారని, ఈ ఏడాది టాప్ కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించాయని ఫ్రోఫేసర్ ఎన్‌పీ ప్యాడీ తెలిపారు. ఇది నవంబర్ వరకు కొనసాగుతోందని ప్యాడీ అభిప్రాయపడ్డారు. ఈ ఆఫర్స్ సంఖ్య 130కి చేరుతుందని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే అడోబ్ రీసెర్చ్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్, రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సామ్‌సంగ్ ఆర్ అండ్ డీ ఇనిస్టిట్యూట్ ఇండియా, ఓయో రూమ్స్, విప్రో లిమిటెడ్ వంటి టాప్ కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించాయని తెలిపారు.
Advertisement
Advertisement