ప్రజారోగ్యానికే ప్రాధాన్యం

ICMR on Covid-19 vaccine deadline Updates - Sakshi

అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ప్రయోగాలు: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారత్‌ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ని ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ్‌ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది.

అంత త్వరగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్‌ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్‌ ట్రాక్‌ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది.  

ఈ ఏడాది వ్యాక్సిన్‌ రాదు: సీసీఎంబీ
కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్‌ఐఆర్‌–సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మొలెక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్‌ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్‌ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్‌ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు.  

మానవ ప్రయోగాలకి 12–18 నెలలు  
మొత్తం మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్‌ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్‌ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్‌ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్‌కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

10-08-2020
Aug 10, 2020, 02:22 IST
సినిమా నిర్మాణం అంటే వందల రోజుల పని. వందల మంది కష్టం. ప్రస్తుతం సినిమా నిర్మాణానికి కరోనా అడ్డుపడుతోంది. ఇక...
09-08-2020
Aug 09, 2020, 20:08 IST
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,820 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
09-08-2020
Aug 09, 2020, 19:51 IST
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కొద్దిరోజులుగా జ్వరం...
09-08-2020
Aug 09, 2020, 17:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో క‌రోనా వైర‌స్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా రికవరీ కేసుల్లో త‌గ్గుద‌ల...
09-08-2020
Aug 09, 2020, 12:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ తెలియజేశారు....
09-08-2020
Aug 09, 2020, 12:31 IST
న్యూఢిల్లీ: పాపడ్‌ తింటే క‌రోనా పోతుంద‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చి విమ‌ర్శ‌ల‌పాలైన‌ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ ఇప్పుడ‌దే వైర‌స్ బారిన ప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న‌కు...
09-08-2020
Aug 09, 2020, 11:02 IST
కాలిఫోర్నియా : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొంతమందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా...
09-08-2020
Aug 09, 2020, 10:17 IST
సాక్షి, ఢిల్లీ : దేశంలో క‌రోనా రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్త‌గా 64,399 క‌రోనా పాజిటివ్‌ కేసులు...
09-08-2020
Aug 09, 2020, 08:55 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆదివారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌...
09-08-2020
Aug 09, 2020, 08:27 IST
సాక్షి, హైదరాబాద్ ‌: కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి జీవితంలో ఎన్నడూ చూడని అమానవీయ సంఘటనల్ని మన కళ్లముందుంచింది. కరోనా వైరస్‌...
09-08-2020
Aug 09, 2020, 08:14 IST
సాక్షి, హైదరాబాద్ ‌: వర్క్‌ ఫ్రం హోం లేదా రిమోట్‌ వర్కింగ్‌.. ఇప్పుడు ఎవరు కలుసుకున్నా, ఫోన్లో పలకరించుకున్నా ఇవే...
09-08-2020
Aug 09, 2020, 04:30 IST
సాక్షి, అమరావతి: కరోనా నుంచి కోలుకుని శనివారం ఒకే రోజు 9,151 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో...
09-08-2020
Aug 09, 2020, 03:51 IST
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఉపముఖ్యమంత్రి,...
09-08-2020
Aug 09, 2020, 03:46 IST
వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే...
08-08-2020
Aug 08, 2020, 21:10 IST
సాక్షి, న్యూఢిల్లీ :  దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులతో పాటు మృతుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది....
08-08-2020
Aug 08, 2020, 20:53 IST
సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్‌లోని...
08-08-2020
Aug 08, 2020, 18:46 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా...
08-08-2020
Aug 08, 2020, 16:26 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అన్నారు....
08-08-2020
Aug 08, 2020, 15:54 IST
ఆరు సార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు.
08-08-2020
Aug 08, 2020, 15:35 IST
ముంబై: ఇటీవల కరోనా బారిన పడిని బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ మహమ్మారిని జయించాడు. గత కొంతకాలంగా కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఆయన‌ చికిత్స తీసుకుంటున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top