వారణాసిలో మోడీని మట్టికరిపిస్తా: కేజ్రీవాల్

వారణాసిలో మోడీని మట్టికరిపిస్తా: కేజ్రీవాల్ - Sakshi


న్యూఢిల్లీ:  వారణాసి బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని మట్టికరిపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ధీమా వ్యక్తం చేస్తారు. అయితే బీజేపీలో చేరుతారని వస్తున్న వార్తలను కేజ్రీవాల్ ఖండించారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు ఢిల్లీలో ఆప్ అభ్యర్థి రాజ్ మోహన్ గాంధీ ప్రచార కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తూర్పారపట్టారు. 


ఒకవేళ పార్లమెంట్ లో అడుగుపెట్టే ఉద్దేశం ఉంటే సులభంగా గెలిచే సీటును ఎంచుకుని పోటీ చేసే వాడినని ఆయన అన్నారు. కేవలం మోడీని ఓడించాలనే కోరికతోనే వారణాసి నుంచి పోటి చేస్తున్నానని ఆయన అన్నారు. అలాగే రాహుల్ గాంధీని ఓడించడానికి అమేథిలో కుమార్ విశ్వాస్ ను బరిలోకి దించామని ఆయన అన్నారు. మోడీ, రాహుల్ గాంధీలిద్దరూ ఓడిపోవాల్సిందే అని కేజ్రీవాల్ అన్నారు. 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top