'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ' | I also did recce of Mumbai airport: Headley | Sakshi
Sakshi News home page

'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ'

Feb 12 2016 9:51 AM | Updated on Sep 3 2017 5:31 PM

'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ'

'ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ'

26/11 మారణహోమంలో ముంబై ఎయిర్ పోర్టుపై దాడి చేయనందుకు లష్కరే తొయిబా అసంతృప్తికి గురైందని డేవిడ్ కోలెమన్ హెడ్లీ వెల్లడించాడు.

ముంబై: 26/11 మారణహోమంలో ముంబై ఎయిర్ పోర్టుపై దాడి చేయనందుకు లష్కరే తొయిబా అసంతృప్తికి గురైందని అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీ వెల్లడించాడు. ముంబై ఎయిర్ పోర్టులో రెక్కీ నిర్వహించానని, ఈ విషయం తెలిసి ఐఎస్‌ఐ అధికారి మేజర్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్టును టార్గెట్ చేయడం మంచి ఆలోచన కాదని ఇక్బాల్ అభిప్రాయపడినట్టు తెలిపాడు.

యూదులు, ఇజ్రాయెల్ దేశస్తులు ఎక్కువగా ఉండే బచబాద్ హౌస్ ను లష్కరే తొయిబా టార్గెట్ గా ఎంపిక చేసిందన్నాడు. పాకిస్థాన్ పై గతంలో భారత్ జరిపిన బాంబు దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలంటే 26/11 దాడులను పక్కాగా అమలు చేయాలని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ తమకు నూరిపోశాడని చెప్పాడు. ఉగ్రవాదులు ఎక్కడ దిగాలో ఇక్బాల్, సాజిద్ మిర్ తనకు వీడియోలో చూపించారని చెప్పాడు. దాడికి పాల్పడిన 10 మంది ఉగ్రవాదులు హిందువులుగా నమ్మించేందుకు సిద్ధివినాయక ఆలయంలో ఎరుపు, పసుపు రంగు తాళ్లు కొన్నారని తెలిపాడు.

ఐఎస్ఐ తరపున పనిచేందుకు భవిష్యత్ లో బాటా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) నుంచి కొంతమందిని నియమించుకోవాలనుకుంటున్నట్టు మేజన్ ఇక్బాల్ తనతో చెప్పాడని వెల్లడించాడు. తాను బార్క్ ను సందర్శించి తీసిన వీడియోను ఇక్బాల్, సాజిద్ మిర్ ఇచ్చినట్టు హెడ్లీ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement