మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం

Home Ministry Says Over 700 Terrorists Killed - Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో గత మూడేళ్లలో 733 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018లో 257 మంది, 2017లో 213 మంది, 2016లో 150 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు అంతమొందిచినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 16 వరకు 113 ఉగ్రవాదులు హతమైనట్టు తెలిపారు. 

అంతేకాకుండా ఈ మడేళ్లలో జమ్మూ కశ్మీర్‌లోని 112 మంది పౌరులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి భద్రతా బలాలు నిరంతరం సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top