టూరిస్ట్ స్పాట్ లోనూ..! | Highest temparatures record in Shimla | Sakshi
Sakshi News home page

టూరిస్ట్ స్పాట్ లోనూ..!

May 21 2016 8:50 AM | Updated on Sep 4 2017 12:37 AM

వేసవిలో ఉపశమనం కోసం సిమ్లాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్లే..!

సిమ్లా: వేసవిలో ఉపశమనం కోసం సిమ్లాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్లే..! ఎప్పుడు చల్లగా ఆహ్లాదంగా ఉండే ఈ టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది. శుక్రవారం రికార్డు స్థాయిలో దాదాపు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దీంతో కూల్ కూల్ గా సేద తీరడానికి పట్టణానికి వచ్చిన యాత్రికులందరూ వేడి, ఉక్కపోతతో బెంబేలెత్తిపోయారు. కాగా, దేశవ్యాప్తంగా శుక్రవారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్ లో అత్యధికంగా 51 డిగ్రీలు, అహ్మదాబాద్ లో వందేళ్ల గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలు గా నమోదయింది.

Advertisement
 
Advertisement
Advertisement