‘ఎన్‌హెచ్’కు భూములిచ్చిన రైతులకు అధిక పరిహారం | High compensation for farmers | Sakshi
Sakshi News home page

‘ఎన్‌హెచ్’కు భూములిచ్చిన రైతులకు అధిక పరిహారం

Jan 25 2016 2:12 AM | Updated on Oct 1 2018 2:09 PM

జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయిన రైతులకు శుభవార్త.

న్యూఢిల్లీ: జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయిన రైతులకు శుభవార్త. కొత్త భూసేకరణ చట్టం(రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్‌మెంట్ యాక్ట్, 2013) ప్రకారం వారికి అధిక పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత భూసేకరణ చట్టం(ఎన్‌హెచ్ యాక్ట్ 1956) కింద భూములు కోల్పోయి పరిహారం అందని వారికి పెంపు వర్తిస్తుంది.

ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ తదితర సంస్థలకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆ శాఖ అధికారి తెలిపారు. జనవరి 1, 2015లోపు పరిహార మొత్తం విషయంలో నిర్ణయం జరిగి, పరిహార మొత్తం చెల్లించని, లేదా భూసేకరణ జరగని(భూమి స్వాధీనం కాని) కేసులకు సంబంధించిన రైతులకూ ఈ పెంపు వర్తిస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement