హెల్మెట్‌ పెట్టుకోలేదని బస్సు డ్రైవర్‌కు చలాన్‌!

Helmet Challan Issued For Bus Driver in Noida - Sakshi

న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అర్థం పర్థం లేని నిబంధనలతో అయినదానికి, కానిదానికి జరిమానాలు ఎడాపెడా విధించేస్తున్నారు. తాజాగా బస్సు డ్రైవర్‌కు హెల్మెట్‌ పెట్టుకోలేదని ఆన్‌లైన్‌ చలాన్‌ విధించారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా బస్సు నడుపుతున్నందుకు రూ. 500 కట్టాలని నోటీసు పంపించారు. దీంతో ఆ డ్రైవర్‌ బిత్తరపోయి.. ఈ విషయాన్ని బస్సు యాజమానికి తెలిపాడు.  ఈ ఘటన నోయిడాలో జరిగింది. 

నోయిడాకు చెందిన నిరాంకార్‌ సింగ్‌కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్‌ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్‌ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్‌ హెల్మెట్‌ పెట్టుకోలేదని, అందుకు రూ. 500 చలాన్‌ చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు నోటిసు పంపారు. దీంతో నిరాంకర్‌ సింగ్‌, ఆయన డ్రైవర్‌ బస్సు నడిపేందుకు హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. 

ట్రాఫిక్‌ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్‌ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్‌ వస్తే.. ఇక మిగతా చలాన్లు ఎంతవరకు సవ్యంగా వస్తున్నాయన్నది సందేహాలు రేకెత్తిస్తోందని, దీనిపై ట్రాఫిక్‌ అధికారులను సంప్రదించడమే కాదు.. అవసరమైతే న్యాయం పోరాటం చేస్తానని నిరాంకర్‌ సింగ్‌ స్పష్టం చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top