ఒడిశాలో పారాదీప్ పోర్టు తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది.
భువనేశ్వర్ : ఒడిశాలో పారాదీప్ పోర్టు పై-లీన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది. పోర్టుకు వచ్చే దారులపై చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకూ అధికారులు 40వేల చెట్లను తొలగించారు. 10 కిలో మీటర్ల వరకు సీ ఛానల్ షిప్పులకు వీలుగాలేదని అధికారులు చెబుతున్నారు. సీ ఛానల్లో ఇంకా ఆరు మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి.
తుపాను తాకిడి వల్ల పలువురు మత్స్యకారులు దారితప్పారు. పారాదీప్‌లో ఏపీకి చెందిన 8 బోట్లు, 80 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. పారాదీప్ ప్రాంతంలో 3వేల మట్టి ఇళ్లు కూలిపోయాయి.