Paradip port
-
పాక్ సిబ్బందితో భారత్‌కు నౌక
పారాదీప్: సింగపూర్ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్‌కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు. -
భారత్‌కు మళ్లీ అమెరికా ‘చమురు’
భువనేశ్వర్: అమెరికా నుంచి ముడి చమురుతో బయలుదేరిన తొలి ఓడ ఒడిశా లోని పారదీప్ ఓడరేవుకు సోమవారం చేరింది. అతి పెద్ద ముడి చమురు రవాణా ఓడ ‘వీఎల్సీసీ ఎమ్టీ న్యూ ప్రాస్పెరిటీ’ ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. మరో 3.95 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కోసం యూఎస్‌ను కోరినట్లు ప్రకటించింది. భారత్–యూఎస్ వాణిజ్య సంబంధాల్లో ప్రధానంగా చమురు–గ్యాస్ రంగాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోకార్బన్ రంగాన్ని పటిష్టపరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నెలలో జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. 1975లో అమెరికా చమురు ఎగుమతులను నిలిపివేసింది. దాదాపు 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభించింది. ఇలా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా భారత్ కూడా నిల్చింది. -
పారాదీప్ పోర్టుకు తీవ్రం నష్టం
భువనేశ్వర్ : ఒడిశాలో పారాదీప్ పోర్టు పై-లీన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయింది. పోర్టుకు వచ్చే దారులపై చెట్లు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకూ అధికారులు 40వేల చెట్లను తొలగించారు. 10 కిలో మీటర్ల వరకు సీ ఛానల్ షిప్పులకు వీలుగాలేదని అధికారులు చెబుతున్నారు. సీ ఛానల్లో ఇంకా ఆరు మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తాకిడి వల్ల పలువురు మత్స్యకారులు దారితప్పారు. పారాదీప్‌లో ఏపీకి చెందిన 8 బోట్లు, 80 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. పారాదీప్ ప్రాంతంలో 3వేల మట్టి ఇళ్లు కూలిపోయాయి.