హెడ్లీ వాంగ్మూలం వాయిదా | Headley testimony postponed | Sakshi
Sakshi News home page

హెడ్లీ వాంగ్మూలం వాయిదా

Feb 11 2016 1:22 AM | Updated on Sep 3 2017 5:22 PM

వీడియో లింక్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ నుంచి వాంగ్మూలం తీసుకోవడాన్ని ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది.

ముంబై: వీడియో లింక్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ నుంచి వాంగ్మూలం తీసుకోవడాన్ని ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది.  రెండు రోజులుగా వీడియో లింక్ ద్వారా ముంబై కోర్టు ముందు వాంగ్మూలం ఇస్తుండడం  తెలిసిందే. బుధవారం వీడియో లింక్‌లో సాంకేతిక సమస్య తలెత్తంగా విచారణ గంట పాటు వాయిదావేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. కాగా, కట్టుకథలను ప్రచారం చేస్తూ.. పాక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి భారత్ ప్రయత్నిస్తోందని ముంబై దాడులప్పుడు పాక్ హోంమంత్రిగా ఉన్న రెహ్మాన్ మాలిక్ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement