జనాలపై మండిపడ్డ కుమారస్వామి

HD Kumaraswamy Said To Locals You Voted For Narendra Modi - Sakshi

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జనాలపై విరుచుకుపడ్డారు. లాఠీ చార్జీ చేయాలా అంటూ బెదిరింపులకు దిగారు. వివరాలు.. గత కొన్ని రోజులుగా సీఎం కుమారస్వామి గ్రామాల్లో బస పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కుమారస్వామి రాయచూర్‌ నుంచి కర్రెగుడ్డ ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కొందరు జనాలు ఆయన బస్సును అడ్డగించి.. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. జనాల చర్యలతో అసహనానికి గురైన కుమారస్వామి వారి మీద మండిపడ్డారు.

‘మోదీకి ఓటేసి.. నన్ను సాయమడుగుతారేంటి’ అని ప్రశ్నించారు. ‘నేను మీకు మర్యాద ఇస్తున్నాను కాబట్టి ఇంత సేపు కామ్‌గా ఉన్నాను. దారి వదులుతారా లేక లాఠీ చార్జీ చేయాలా’ అంటూ కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఓ ఐదు నిమిషాల పాటు గందరగోళం నెలకొంది. ఈ లోపు పోలీసులు వచ్చి జనాలను చెదరగొట్టడంతో.. కుమారస్వామి అ‍క్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు కుమారస్వామి తీరు పట్ల మండిపడుతున్నాయి. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి విచక్షణ మరిచి ఇలా ప్రవర్తించడం సిగ్గు చేటంటూ విమర్శిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top