త్వరలో సోదర రాష్ట్రాలుగా హవాయ్, గోవా! | Hawaii, Goa to be sister states soon: Parsekar | Sakshi
Sakshi News home page

త్వరలో సోదర రాష్ట్రాలుగా హవాయ్, గోవా!

Mar 31 2016 8:32 PM | Updated on Nov 6 2018 4:10 PM

త్వరలో సోదర రాష్ట్రాలుగా హవాయ్, గోవా! - Sakshi

త్వరలో సోదర రాష్ట్రాలుగా హవాయ్, గోవా!

అమెరికాలోని ఐస్టాండ్ కు చెందిన హవాయ్.. ఇండియాలోని గోవా రాష్ట్రాలు త్వరలో సోదర రాష్ట్రాలుగా మారనున్నాయి. అటువంటి సంబంధాన్ని బలపరుస్తూ గురువారం గోవా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది.

పనాజీ: అమెరికాలోని ఐస్టాండ్ కు చెందిన హవాయ్.. ఇండియాలోని గోవా రాష్ట్రాలు త్వరలో సోదర రాష్ట్రాలుగా మారనున్నాయి. అటువంటి సంబంధాన్ని బలపరుస్తూ గురువారం గోవా రాష్ట్ర మంత్రి వర్గం  ఆమోదించింది. దీంతో ఇప్పడు గోవా సోదర రాష్టంగా మారనుంది.  బీచ్ లతో గుర్తింపు పొందిన ఆ రెండు ఉష్ణమండలాల మధ్య పరస్పర సహకారం కోసం అవగాహనా కాగితాలపై తాత్కాలిక సంతకాలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్ వెల్లడించారు.

త్వరలో హవాయ్, గోవా రాష్ట్రాల మధ్య పూర్తిశాతం సహకార ఒప్పందాలపై సంతకాలు చేసుకుంటామని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ తెలిపారు. కేబినెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్సేకర్ ఆ విషయాన్ని వెల్లడించారు.  పర్యాటక, క్రీడా, ఫార్మా, యోగా, ఆయుర్వేద మరియు హవాయి ఉత్పత్తులపై వాణిజ్య సహకారంతో పాటు విద్యావిధానాన్ని మెరుగుపరిచే విషయంపై కూడ తాము చర్చలు జరిపామని, రెండు రాష్ట్రాల మధ్య  పరస్పర మారకం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.  గోవా ప్రభుత్వ కళలు, సాంస్కృతిక విభాగం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి,  ఇరు రాష్ట్రాల మధ్య సోదర రాష్ట్ర సంబంధాలను  రూపొందించే బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్సేకర్ తెలిపారు.  

రెండేళ్ళక్రితం అమెరికా కాంగ్రెస్ మహిళ తులసీ గబ్బర్డ్ హవాయి నుంచి గోవా పర్యటనకు వచ్చారు. ఆమె పర్యటన సందర్భంలో హవాయి, గోవాలను సోదర రాష్ట్రాలుగా చేయాలన్న ఆలోచన ప్రారంభమైంది.  అమెరికా ఇండియా మధ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు ఇండియన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలుస్తానని ఆమె హామీ ఇచ్చారు. అమెరికాలోని ఒసియానియా సమోవాలో పుట్టిన తులసీ గబ్బర్డ్ తల్లి హిందూ మతస్థురాలు కావడంతో ఆమె హిందూ మత సాధకురాలుగా కూడ ఉన్నారు. అప్పట్లో ఆమె మనసులో ఉత్పన్నమైన ఆలోచన ప్రస్తుతం కార్యరూపం దాల్చడంతో  త్వరలో హవాయ్, గోవాలు సోదర రాష్ట్రాలుగా మారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement