breaking news
parsekar
-
‘సముద్రపు అలల నుంచి కరెంట్’
పణజి: సముద్రపు అలల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చే యడానికి గల మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించి దీన్ని సుసాధ్యం చేయాలనుకుంటోంది. గోవాలో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందనీ, అలల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తు చౌకగా లభించడంతోపాటు పర్యావరణహితంగానూ ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. అలాగే ప్రస్తుతమున్న సంప్రదాయ రవాణా వ్యవస్థ స్థానంలో పర్యావరణహిత వ్యవస్థను ప్రవేశపెట్టడానికి గల మార్గాలను పరిశీలించాలని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ను గడ్కారీ కోరారు. -
త్వరలో సోదర రాష్ట్రాలుగా హవాయ్, గోవా!
పనాజీ: అమెరికాలోని ఐస్టాండ్ కు చెందిన హవాయ్.. ఇండియాలోని గోవా రాష్ట్రాలు త్వరలో సోదర రాష్ట్రాలుగా మారనున్నాయి. అటువంటి సంబంధాన్ని బలపరుస్తూ గురువారం గోవా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. దీంతో ఇప్పడు గోవా సోదర రాష్టంగా మారనుంది. బీచ్ లతో గుర్తింపు పొందిన ఆ రెండు ఉష్ణమండలాల మధ్య పరస్పర సహకారం కోసం అవగాహనా కాగితాలపై తాత్కాలిక సంతకాలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్ వెల్లడించారు. త్వరలో హవాయ్, గోవా రాష్ట్రాల మధ్య పూర్తిశాతం సహకార ఒప్పందాలపై సంతకాలు చేసుకుంటామని గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ తెలిపారు. కేబినెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్సేకర్ ఆ విషయాన్ని వెల్లడించారు. పర్యాటక, క్రీడా, ఫార్మా, యోగా, ఆయుర్వేద మరియు హవాయి ఉత్పత్తులపై వాణిజ్య సహకారంతో పాటు విద్యావిధానాన్ని మెరుగుపరిచే విషయంపై కూడ తాము చర్చలు జరిపామని, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర మారకం ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. గోవా ప్రభుత్వ కళలు, సాంస్కృతిక విభాగం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఇరు రాష్ట్రాల మధ్య సోదర రాష్ట్ర సంబంధాలను రూపొందించే బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్సేకర్ తెలిపారు. రెండేళ్ళక్రితం అమెరికా కాంగ్రెస్ మహిళ తులసీ గబ్బర్డ్ హవాయి నుంచి గోవా పర్యటనకు వచ్చారు. ఆమె పర్యటన సందర్భంలో హవాయి, గోవాలను సోదర రాష్ట్రాలుగా చేయాలన్న ఆలోచన ప్రారంభమైంది. అమెరికా ఇండియా మధ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు ఇండియన్ కమ్యూనిటీకి మద్దతుగా నిలుస్తానని ఆమె హామీ ఇచ్చారు. అమెరికాలోని ఒసియానియా సమోవాలో పుట్టిన తులసీ గబ్బర్డ్ తల్లి హిందూ మతస్థురాలు కావడంతో ఆమె హిందూ మత సాధకురాలుగా కూడ ఉన్నారు. అప్పట్లో ఆమె మనసులో ఉత్పన్నమైన ఆలోచన ప్రస్తుతం కార్యరూపం దాల్చడంతో త్వరలో హవాయ్, గోవాలు సోదర రాష్ట్రాలుగా మారనున్నాయి. -
ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం
ట్రయల్ రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో గోవా సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ ఫ్యాబ్ ఇండియా సంస్థకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆ సంస్థ తప్పేమీ లేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత బొటిక్లలో ఫ్యాబ్ ఇండియా ఒకటని, ఉద్యోగి దుర్మార్గుడైనంత మాత్రాన సంస్థ మొత్తాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 'సాక్షాత్తు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లభించింది. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గోవాలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది. అని పర్సేకర్ అన్నారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూంలో దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా ఉండటాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.