మీ పేర్ల ముందు ‘పప్పూ’ యాడ్‌ చేసుకోండి.. | Haryana Minister Sugests Cong Workers To Add Pappu To Their Names | Sakshi
Sakshi News home page

మీ పేర్ల ముందు ‘పప్పూ’ యాడ్‌ చేసుకోండి..

Published Tue, Mar 19 2019 2:48 PM | Last Updated on Tue, Mar 19 2019 2:54 PM

Haryana Minister Sugests Cong Workers To Add  Pappu To Their Names   - Sakshi

హర్యానా మంత్రి ‘పప్పు’ వ్యాఖ్యలు వైరల్‌

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో తమ పేర్లకు చౌకీదార్‌ ట్యాగ్‌ను యాడ్‌ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్‌ విమర్శలను బీజేపీ దీటుగా తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ పేర్లకు ‘పప్పు’ అని యాడ్‌ చేసుకుంటే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని హర్యానా మంత్రి అనిల్‌ విజ్‌ పేర్కొన్నారు. తాము తమ పేర్లలో చౌకీదార్‌ (కాపలాదారు) అనే పదాన్ని జోడించామని, మీరు కూడా మీ పేర్లకు ముందు పప్పూ అని పెట్టుకోవాలని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేస్తూ ఆయనను బీజేపీ పప్పూ అని పిలవడం తెలిసిందే. కాగా రాహుల్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు రఫేల్‌ ఒప్పందంలో అవినీతిని ప్రస్తావిస్తూ కాపలాదారే దొంగ అని విమర్శిస్తున్నారు. ఇక చౌకీదార్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, పీయూష్‌ గోయల్‌, దర్మేంధ్ర ప్రధాన్‌, జేపీ నడ్డా సహా పలువురు నేతలు తమ ట్విటర్‌ ఖాతాల్లో పేరుకు ముందు చౌకీదార్‌ను యాడ్‌ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement