ఉరిశిక్ష రద్దుపై పిటిషన్‌.. కీలక పరిణామాలు

Hanging Far Safer And Quicker Centre Tells SC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఉరి శిక్ష రద్దును చేసి.. ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్‌ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు.

దీంతో కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించించి. దీనికి స్పందించిన కేంద్రం మంగళవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. దీనిని పరిశీలనకు స్వీకరించిన తదుపరి విచారణను వాయిదా వేసింది.

                                   కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొన్న వివరాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top