కర్ణాటకలోని యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడం హంపీ దేవాలయాన్ని ఇకపై మొబైల్‌ఫోన్....
న్యూఢిల్లీ: కర్ణాటకలోని యునెస్కో గుర్తిం చిన ప్రపంచ వారసత్వ కట్టడం హంపీ దేవాలయాన్ని ఇకపై మొబైల్‌ఫోన్‌లో డిజిటల్ రూ పంలోనూ దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ శిథిలమైన విఠల దేవాల యాన్ని కూడా పూర్వపు స్థితిలో చూడవచ్చు. హంపీ దేవాలయాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా 3డీ చిత్రాలతో డిజి టల్ రూపంలో ఆవిష్కరించినట్లు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ శంతను చౌదరీ వెల్లడించారు.
ఐఐటీలు, ఇతర సంస్థల సాంకేతిక సహకారంతో దీనిని రూపొం దించినట్లు తెలి పారు. మంగళవారం ప్రారంభం కానున్న రెండు రోజుల ‘ఇండియా హ్యాబిటాట్ సెంటర్’ ఎగ్జిబిషన్‌లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరీ ఈ ‘డిజి టల్ హంపీ’ని ఆవి ష్కరిస్తారని పేర్కొన్నారు.