గుజరాత్‌లోని జైనులకు మైనారిటీ హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది.
అహ్మదాబాద్: గుజరాత్‌లోని జైనులకు మైనారిటీ హోదా ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. యూపీఏ ప్రభుత్వం 2014 జనవరిలోనే జైనులను మైనారిటీలుగా గుర్తించింది.
గుజరాత్ కూడా దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేలోపే పటేళ్ల ఆందోళన ఉధృతం అవటంతో.. పక్కన పెట్టిందని. రాష్ట్ర రవాణా మంత్రి, రాష్ట్ర బీజేపీ కమిటీ చీఫ్ రూపానీ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల జైనుల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. విజయ్ కూడా జైనుడే కావటం విశేషం.