వాళ్లు సన్యాసం స్వీకరిస్తే.. ఆ బుజ్జాయి సంగతేంటి?

jain Couple - Sakshi

అహ్మదాబాద్: జైన దంపతులు సుమిత్ రాథోడ్, అనామిక తమ మూడేళ్ల కూతురిని, వందకోట్ల సంపదను వదిలి సన్యాసం స్వీకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గుజరాత్ బాలల హక్కుల సంస్థ ఈ వ్యవహారంపై స్పందించింది. జైన దంపతులు సన్యాసం స్వీకరిస్తున్న నేపథ్యంలో వారి కూతురి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరింది.

మధ్యప్రదేశ్ జైనదంపతులైన సుమిత్, రాథోడ్ జైనమత సాధువులుగా మారాలని నిర్ణయించుకున్నారు. తమ మూడేళ్ల కూతురిని, రూ. 100 కోట్ల సందపను వదిలి..శ్వేతబంర జైనసాధువులుగా మారుతున్నామని వారు ప్రకటించడం చర్ఛనీయాంశమైన సంగతి తెలిసిందే. శనివారం సూరత్ లో జరిగే దీక్షా క్రతువు ద్వారా ఆ జైన దంపతులు సాధువులుగా మారనున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కూతురి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడని, ఆ పాపాయిని సంరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని గుజరాత్ బాలల హక్కుల కమిషన్ ను కోరారని కమిషన్ చైర్ పర్సన్ జాగృతి పాండే తెలిపారు. జైనదంపతుల సన్యాస దీక్ష కార్యక్రమం సూరత్ లో జరుగుతున్న నేపథ్యంలో వారి చిన్నారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో  తెలుసుకొని తమకు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్టు తెలిపారు. అయితే, అనామిక తండ్రి, బీజేపీ నీముచ్ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ చండిలాయ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top