దేశంలోనే అతిపిన్న వయసు స్పీకర్‌గా రికార్డు.. | Sakshi
Sakshi News home page

దేశంలోనే అతిపిన్న వయసు స్పీకర్‌గా రికార్డు..

Published Wed, Apr 5 2017 7:53 PM

దేశంలోనే అతిపిన్న వయసు స్పీకర్‌గా రికార్డు.. - Sakshi

పణాజీ: దేశంలోనే అతిపిన్న వయస్కుడిగా గోవా అసెంబ్లీ స్పీకర్‌ రికార్డులకెక్కారు. పాలె నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రమోద్‌ సావంత్‌(44) గోవా అసెంబ్లీ స్పీకర్‌గా ఇటీవల ఎంపికయ్యారు. మనోహర్‌ పారికర్‌ ఆధ్వర్యంలోని బీజేపీ పార్టీ గత నెలలో గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విదితమే. స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిని సావంత్‌ ఓడించారు. దేశంలో ఇప్పటి వరకు స్పీకర్లుగా పనిచేసిన వారి జాబితాను  గోవా అసెంబ్లీవిడుదల చేసింది.

ప్రమోద్‌ సావంత్‌ అతి చిన్న వయస్సులోనే స్పీకర్‌గా ఎంపికయ్యారని తెలిపింది. ఈయన ఇప్పటి వరకు రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రమోద్‌ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే స్పీకర్‌గా ఎంపికైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని  మీడియాకు తెలిపారు. శాసనసభ హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కైలాష్‌ మేఘ్వాల్‌(83) వృద్ధుడైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
 
 
 

Advertisement
Advertisement