2 శాతం పెరిగిన స్టెంట్ల ధరలు | Govt increases stent prices by around 2% | Sakshi
Sakshi News home page

2 శాతం పెరిగిన స్టెంట్ల ధరలు

Mar 31 2017 10:03 PM | Updated on Sep 5 2017 7:35 AM

2 శాతం పెరిగిన స్టెంట్ల ధరలు

2 శాతం పెరిగిన స్టెంట్ల ధరలు

ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) స్టెంట్ల ధరలను 2 శాతం పెంచింది.

న్యూఢిల్లీ: ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) స్టెంట్ల ధరలను 2 శాతం పెంచింది. టోకు ధరల సూచీ ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి రానుంది. తాజా మార్పులతో బేర్‌ మెటల్‌ స్టెంట్ల ధరలు రూ.7260 నుంచి రూ.7400కు పెరిగాయి. అలాగే ఎల్యూటింగ్‌ స్టెంట్ల ధరలు రూ.29600 నుంచి రూ. 30,180కి చేరుకున్నాయి.

హెపటిటిస్‌, హెచ్‌ఐవీ, టీబీలకు లాంటి వ్యాధులకు వాడే 46 డ్రగ్‌ ఫార్ములేషన్ల గరిష్ట ధరలను కూడా ఎన్‌పీపీఏ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఎన్‌పీపీఏ స్టెంట్లను ధరల నియంత్రణ జాబితాలోకి తెచ్చి బేర్‌ మెటల్‌ స్టెంట్ల ధరలను రూ.7260గా, డ్రగ్‌ ఎల్యూటింగ్‌ స్టెంట్ల ధరలను రూ.29600గా నిర్ధారించింది. అంతకు ముందు వాటి సరాసరి గరిష్ట ధరలు వరుసగా రూ.45,100, రూ.1.21 లక్షలుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement