Sakshi News home page

భారత్‌ పెద్ద తప్పు చేసింది.. పాక్‌కు చాలా హ్యాపీ

Published Sun, May 21 2017 12:52 PM

భారత్‌ పెద్ద తప్పు చేసింది.. పాక్‌కు చాలా హ్యాపీ

న్యూఢిల్లీ: భారత్‌ అనవసరంగా పాకిస్థాన్‌కు అవకాశం ఇచ్చిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ అన్నారు. కులభూషణ్‌ జాదవ్‌ కేసు విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భారత్‌ పెద్ద తప్పు చేసిందని చెప్పారు. ఈ ఒక్క చర్యతో పాక్‌ ఆశల పేటిక తెరుకుందని, ఇక వారు భారత్‌పై ప్రతిసారి ఐసీజే తలుపుతడతారని, భారత్‌ కచ్చితంగా సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. ఒక్క వ్యక్తి జీవితాన్ని కాపాడేందుకు భారత్‌ ఈ ప్రయత్నం చేస్తే ఇప్పుడు కశ్మీర్‌ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై ఐసీజేకు వెళతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఫేస్‌బుక్‌లో కులభూషణ్‌ జాదవ్‌ కేసు, ఐసీజే విషయాన్ని ప్రస్తావిస్తూ రాశారు. ‘జాదవ్‌ కేసు విషయంలో ప్రపంచ న్యాయస్థానానికి వెళ్లి చాలా తీవ్రమైన తప్పుచేసింది. బహుశా.. ఐసీజే తీర్పు విషయంలో చాలామంది సంబురాలు చేసుకుంటుండొచ్చు. కానీ, నా అభిప్రాయంలో అది భారత్‌ చేసిన పెద్ద తప్పు. ఇది పాక్‌ చెప్పుచేతల్లో మనం ఆడుతున్నట్లు. ఎన్నో విషయాలు ఇప్పుడు ఐసీజే చేతుల్లో పెట్టినట్లు. కశ్మీర్‌ విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థను, వ్యక్తులను ఇ‍ప్పటి వరకు అనుమతించని మనం ఇప్పుడు పాక్‌ ఐసీజేకు వెళితే జోక్యానికి అంగీకరించాల్సి వస్తుంది. ఇది పాక్‌ ఆశ పేటిక తెరిచినట్లే. ఒక వ్యక్తి కోసం కశ్మీర్‌వంటి సమస్య కూడా ఐసీజేకు వెళ్లేలాగా చేశారు. పాకిస్థాన్‌ ఇప్పుడు నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండిఉంటుంది’ అని కట్జూ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

Advertisement
Advertisement