క్రయోజనిక్‌ హాట్‌ టెస్ట్‌ విజయవంతం

GLSV-F11’s cryogenic engine tested - Sakshi

శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రయోగించబోయే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–11కు సంబంధించి క్రయోజనిక్‌ ఇంజిన్‌ యాక్సెప్ట్‌ హాట్‌ టెస్ట్‌ విజయవంతంగా ముగిసింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కేంద్రంలో ఆగస్టు 27న చేపట్టిన ‘హాట్‌ టెస్ట్‌’ సక్సెస్‌ అయ్యిందని ఇస్రో శనివారం ప్రకటించింది. క్రయోజనిక్‌ ఇంజిన్‌ను సుమారు 200 సెకన్లపాటు పనిచేయించి పరీక్షించారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించి కీలకమైన క్రయోజనిక్‌ దశ అత్యంత సంక్లిష్ట పరిజ్ఞానంతో కూడుకున్నది కావడంతో ఈ దశలో ఎప్పటికప్పుడు నూతనంగా పలు పరీక్షలు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top