
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 5.40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ఉపగ్రహాన్ని 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.