దేవుని మీద నమ్మకం లేని సాక్షులు రాజ్యాంగంపై ప్రమాణం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
నాస్తికులకు స్వేచ్ఛనివ్వాలని పిల్
ముంబై: దేవుని మీద నమ్మకం లేని సాక్షులు రాజ్యాంగంపై ప్రమాణం చేసే అవకాశం కల్పించాలని కోరుతూ బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని పుణెకు చెందిన దంపతులు సునిల్ మానె,లక్ష్మి వీటిని వేశారు. మహారాష్ట్రలోని భీవండి, పుణెలో జరిగిన రెండు సంఘటనలను ఉదహరించారు.
తమకు దేవునిపై నమ్మకం లేదని, రాజ్యాంగంపై ప్రమాణం చేస్తామన్న పుణెలోని కొందరు సీనియర్ ప్రభుత్వ అధికారుల కోరికను కోర్టు మన్నించలేదని తెలిపారు. భీవండి స్థానిక సంస్థకు చెందిన అధికారి కూడా ఇలాంటి పిటిషన్‌నే దాఖలు చేశారు. ప్రస్తుత ప్రమాణాల చట్టం, 1969 ప్రకారం కోర్టుకు హాజరైన సాక్షులు దేవునిపై లేదా తమ పవిత్ర గ్రంథం ప్రమాణం చేయాలి.