తల్లిదండ్రులముందే బాలిక కాల్చివేత | girl shot dead in front of parents by militants in Assam | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులముందే బాలిక కాల్చివేత

Aug 28 2014 3:33 AM | Updated on Sep 2 2017 12:32 PM

అస్సాంలోని బోడోలాండ్ తీవ్రవాదులు తెగబడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను ఇంట్లోనుంచి బయటకు లాగి, దారుణంగా కొట్టి, తల్లిదండ్రుల కళ్లముందే, పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో తొమ్మిదిసార్లు కాల్చి చంపారు.

చిరాంగ్ జిల్లా (అస్సాం): అస్సాంలోని బోడోలాండ్ తీవ్రవాదులు తెగబడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను ఇంట్లోనుంచి బయటకు లాగి, దారుణంగా కొట్టి, తల్లిదండ్రుల కళ్లముందే, పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో తొమ్మిదిసార్లు కాల్చి చంపారు. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. తీవ్రవాదులు చిరాంగ్ జిల్లాలోని ద్విముగ్రి గ్రామంలోకి ప్రవేశించి ప్రియ బసుమతారే అనే బాలికను ఇంటినుంచి బయటకు లాగారు. తల్లిదండ్రులను కళ్లుకూడా పక్కకు తిప్పుకోవద్దంటూ భయపెట్టి ఆ బాలిక శరీరంలోకి తొమ్మిది తూటాలు దింపారు. రెండు రోజులపాటు ప్రియ శరీరం అలాగే బయటే పడిఉంది. అంతకు ముందురోజు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు తీవ్రవాదులు మరణించారు. పోలీసులకు ప్రియనే సమాచారం అందించిందన్న అనుమానంతో తీవ్రవాదులు ఆమెను చంపారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement