గొప్ప మనసు చాటుకున్న గౌతం గంభీర్‌ | Sakshi
Sakshi News home page

'ప్రతీ జీవితానికి మనదే బాధ్యత'

Published Thu, Jul 2 2020 2:50 PM

Gautam Gambhir Give 50 Isolation Beds To Delhi Government - Sakshi

ఢిల్లీ : బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో గంభీర్‌ 50 పడకల గల ఐసోలేషన్‌ సెంటర్‌ను సిద్ధం చేసి గురువారం ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించి తన ఉదారతను చాటుకున్నారు. గంభీర్‌ ఫౌండేషన్‌ సెంటర్‌ ద్వారా తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్‌ ప్రాంతంలో కోవిడ్‌-19 ఐసోలేషన్‌ కేంద్రాన్ని సిద్ధం చేశారు. మొత్తం 50 పడకలతో రూపొందించిన ఐసోలేషన్‌ సెంటర్‌లో ప్రతి బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యం కూడా కల్పించారు. (2 రోజుల‌పాటు ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్‌లో క‌రోనా డెడ్‌బాడీ)


గంభీర్‌ మాట్లాడుతూ..' కరోనా సోకినవారు  ఎవరైనా సరే ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడికి రావచ్చు. ఇక్కడకు వచ్చే కరోనా బాధితులకు మా సెంటర్‌లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మానవతాదృక్పథంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. అందుకే నేను ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాను. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ త్వరలో ఇతర ప్రాంతాలలో కూడా ఐసోలేషన్‌ కేంద్రాలను నిర్మిస్తోంది. ' ప్రతి జీవితానికి మనమే బాధ్యత!'' అంటూ సందేశాన్నిచ్చారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్యా కరోనా బాధితులను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్‌ ప్రభుత్వం పలు పంక్షన్‌ హాళ్లను ఐసోలేషన్‌ సెంటర్‌గా మార్చి కోవిడ్‌ ఆసుపత్రులకు అనుసంధానించింది. ఇప్పటివరకు ఢిల్లీలో 87,360 కరోనా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య 2,742గా ఉంది.

Advertisement
Advertisement